Indian Team: భారత క్రికెట్ లో ప్రస్తుత కాలంలో ఫ్యాన్ ఆర్మీ, సూపర్ హీరో సంస్కృతి బాగా పెరిగిపోయిందని టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నారు. ఇది భారత క్రికెట్ ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉందని తెలిపాడు. ఆటగాళ్ల కంటే వారి పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) కంటెంట్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది, దీని వల్ల ఫ్యాన్ వార్ బాగా పెరిగిపోతుందని చెప్పుకొచ్చాడు.
కోల్‌కతాలో జరిగిన రేవ్ స్పోర్ట్స్ కాన్ క్లేవ్ కార్యక్రమానికి హాజరైన రవీచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. ఈ ప్లేయర్ కి మరో ఆటగాడితో సమస్య ఉంటుంది.. అందుకే అతడు జట్టులో ఉండడు.. ఇలాంటివి అన్నీ సోషల్ మీడియాలో చదువుతుంటే షాకింగ్ గా అనిపిస్తుంది.. ఇలాంటివే తరచుగా కనిపిస్తుంటే, సహజంగానే ఏదో జరుగుతుందన్న అభిప్రాయం కలుగుతుందన్నారు. కోచ్ గౌతమ్ గంభీర్ చేయాల్సిన పని చాలానే ఉంది.. టీమ్ లో నుంచి నేను, కోహ్లి, రోహిత్ వెళ్లిపోవాలని అతడు అనుకున్నప్పటికీ పర్వాలేదు.. అది అతడి పని, నేను ఎప్పుడూ పొగరుని వదిలి పెట్టాలని చూశానని అశ్విన్ వెల్లడించారు.
►ALSO READ | Rohit Sharma: ఇంపాక్ట్ ప్లేయర్ గా రోహిత్ శర్మ.. MI కోచ్ ఏమన్నారంటే?
ఇక 25 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాపై వీవీఎస్ లక్ష్మణ్ ఆడిన 281 పరుగుల చారిత్రక ఇన్నింగ్స్ అందరికీ గుర్తు పెట్టుకునే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం ప్రతి ఒక్కరు గమనించాలి. ఆ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది కాబట్టి లక్ష్మణ్ ఆడిన ఇన్నింగ్స్ రికార్డుల్లో నిలిచిపోయింది.. అది కేవలం లక్ష్మణ్ వ్యక్తిగత ప్రదర్శన మాత్రమే కాదు.. జట్టు గెలుపు కూడా.. ఫ్యాన్స్ క్రికెటర్లను ఆరాధించవచ్చు, కానీ డ్రెస్సింగ్ రూమ్ లో వ్యక్తుల కంటే జట్టుకే అధిక ప్రాధాన్యం ఇస్తారని రవీచంద్రన్ అశ్విన్ చెప్పారు.
